Monday, April 29, 2024

టైగర్‌ ప్రేయసి

.మాస్‌ మహారాజా రవితేజ నటిస్తున్న పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ ‘-టైగర్‌ నాగేశ్వరరావు’. వంశీ దర్శకుడు. ఈ చిత్రం -టైగర్‌ దండయాత్ర అనే టీ-జర్‌ వైరల్‌గా మారి అంచనాలని పెంచింది. ది కాశ్మీర్‌ ఫైల్స్‌, కార్తికేయ 2 చిత్రాలను రూపొందించిన అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ అగర్వాల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన నూపుర్‌ సనన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

తాజాగా -టైగర్‌ ప్రేయసి సారాగా నూపూర్‌ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. రైలులో కిటికీ సీట్లో కూర్చున్న నూపూర్‌ తన లవ్‌ని కలుసుకోవడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు- ఫస్ట్‌ లుక్‌ లో కనిపిస్తోంది. బాలీవుడ్‌ నటి కృతి సనన్‌ సోదరి నుపుర్‌ సనన్‌ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్‌ మరో హీరోయిన్‌.ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఆర్‌ మదీ ఐఎస్‌సి, సంగీతం జివి ప్రకాష్‌ కుమార్‌ అందిస్తున్నారు. అవినాష్‌ కొల్లా ప్రొడక్షన్‌ డిజైనర్‌. శ్రీకాంత్‌ విస్సా సంభాషణలు అందిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 20న విడుదల చేస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement