Monday, April 29, 2024

రెండవ ప్రతినిధి

నారా రోహిత్‌ నటిస్తున్న పొలిటికల్‌ థ్రిల్లర్‌ ‘ప్రతినిధి 2’. మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ కు మంచి స్పందన వచ్చింది. సక్సెస్‌ ఫుల్‌ పొలిటికల్‌ థ్రిల్లర్‌ ‘ప్రతినిధి’ సిరీస్‌ నుండి రెండవ ఫ్రాంచైజీగా వస్తున్న ఈ ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైయింది. హీరో నారా రోహిత్‌ పై కీలకమైన సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు.

‘ప్రతినిధి 2’ కోసం వైవిధ్యమైన కథను ఎంచుకున్నారు నారా రోహిత్‌. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ సినిమాపై చాలా ఆసక్తిని – పెంచింది.కుమార్‌ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. మహతి స్వర సాగర్‌ సంగీతం అందిస్తుండగా, నాని చమిడిశెట్టి సినిమాటోగ్రాఫర్‌ గా పని చేస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటర్‌, కిరణ్‌ కుమార్‌ మన్నె ఆర్ట్‌ డైరెక్టర్‌. ఈ చిత్రం 2024 జనవరి 25న రిపబ్లిక్‌ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది

Advertisement

తాజా వార్తలు

Advertisement