Thursday, May 9, 2024

ఈ పుట్టినరోజు నాకెంతో స్పెషల్‌ – హీరో విశాల్‌

హీరో విశాల్‌ పుట్టినరోజు మంగళవారం (ఆగస్ట్‌ 29). ఈ సందర్బంగా ఆయన త్వరలోనే ‘మార్క్‌ ఆంటోని’ అనే చిత్రంతో సందడి చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన రాబోతున్న తన కొత్త సినిమా గురించిన సంగతులను ప్రత్యేకంగా వివరించారు.

ఈ బర్త్‌ డే నాకెంతో ప్రత్యేకం అని చెప్పాలి. ఎందుకంటే రానున్న సెప్టెంబర్‌ 15న మార్క్‌ ఆంటోని అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. ఇప్పటి వరకు నేనేన్నో వైవిధ్యమైన పాత్రలు, సినిమాల్లో నటించాను. ప్రేక్షకులు నన్ను ఎప్పటికీ ఆదరిస్తూనే వచ్చారు. వారు అందించిన ఆదరాభిమానాలతోనే నేను ఈ స్థాయికి వచ్చాను. నాపై ఇంత ఆదరాభిమానాలు చూపిస్తున్న ప్రేకకులకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. మార్క్‌ ఆంటోని విషయానికి వస్తే నా కెరీర్లో ఇదెంతో ముఖ్యమైన సినిమా. పీరియాడిక్‌ మూవీ. ఇందులో రెండు విభిన్నమైన పాత్రల్లో నటించాను. ఓ కీలకమైన పాత్రలో ఎస్‌.జె.సూర్య నటించారు. జి.వి.ప్రకాష్‌ గారు సంగీతాన్ని అందిస్తున్నారు. కమర్షియల్‌ అంశాలన్నీ అన్నీ సినిమాలో ఉంటాయి. అన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement