Monday, May 6, 2024

రేప్ కేసులో టిక్ టాక్ స్టార్ అరెస్ట్… ఏం చేశాడో తెలుసా ?

ఇటీవల కాలంలో టిక్ టాక్ యాప్ ద్వారా ఎంతోమంది ఫేమస్ అయ్యారు. అందులో భార్గవ్ కూడా ఒకడు. అయితే ఈ టిక్ టాక్ స్టార్ భార్గవ్ ను పోలీసులు అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కోర్టు ముందు హాజరు పరిచిన భార్గవ్ కు న్యాయమూర్తి వచ్చే నెల 3వ తేదీ వరకు రిమాండ్ విధించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే ఫన్ బాస్కెట్ పేరుతో వీడియోలు చేసే భార్గవ్ టిక్ టాక్ లో కూడా వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యాడు. టిక్ టాక్ నిషేధించడంతో మోజో, రోపోసో యాప్ లతో వీడియోలను చేస్తూ ఉన్నాడు. కాగా పెందుర్తి కి చెందిన ఓ బాలికకు భార్గవ్ పరిచయమయ్యాడు. ఆమెకు మాయమాటలు చెప్పి శారీరకంగా లోబరుచుకున్నాడు. కొన్నాళ్ళకు గర్భవతి అని తెలియడంతో తప్పించుకున్నాడు. దీంతో విశాఖ పోలీసులు బాధిత బాలిక ఫిర్యాదు చేసింది. ఈ పిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement