Wednesday, May 1, 2024

30 రోజుల్లో మూడు సినిమాలు!!

ఒకానొక సమయంలో స్టార్ హీరోల సరసన నటించి బ్లాక్ బాస్టర్ హిట్స్ ను అందుకుంది భూమిక . ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇక ఇటీవల న్యాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ఎం.సి.ఎ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆ తర్వాత యూటర్న్, సవ్యసాచి, రూలర్ వంటి చిత్రాలలో కూడా నటించింది. తాజాగా భూమిక నటించిన మూడు చిత్రాలు ఒకే నెలలో విడుదల కాబోతున్నాయి.

ఏప్రిల్ 2న రిలీజ్ అవుతున్న సిటీ మార్ సినిమాలో భూమిక హీరో గోపీచంద్ సోదరి పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వంలో వహించారు. మరోవైపు ఏప్రిల్ 30న విడుదల కాబోతున్న విశ్వక్ సేన్ పాగల్ మూవీ లో కూడా భూమిక నటించింది. అలాగే సుమంత్ అశ్విన్ ,శ్రీకాంత్, ప్రధాన పాత్రలో ప్రేక్షకులను ముందుకు రాబోతున్న ఇదే మా కథ సినిమాలో కూడా భూమిక నటించింది. రోడ్ జర్నీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే నెల రిలీజ్ కాబోతోంది. నిజానికి ఈ సినిమా ఈ నెల 19న రిలీజ్ కావాల్సి ఉంది. ఇక భూమిక తెలుగుతో పాటు తమిళ,హిందీ సినిమాల్లో కూడా నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement