Saturday, May 4, 2024

ఈ నెల సినిమాల జాత‌ర.. థియేటర్లలో రిలీజ్ కానున్న సినిమాలివే !

జ‌న‌వ‌రి నెల‌ టాలీవుడ్‌కు క‌లిసొచ్చింది. సంక్రాంతికి రిలీజైన హ‌నుమాన్ సెన్సేష‌న‌ల్‌ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. రిలీజ్ అయిన 15 రోజుల్లోనే 250 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి ఇండ‌స్ట్రీ హిట్‌గా రికార్డులు సృష్టించింది. హ‌నుమాన్‌తో పాటు సంక్రాంతికి రిలీజైన మ‌హేష్ బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామిరంగ సినిమాలు నిర్మాత‌ల‌కు లాభాల‌ను తెచ్చిపెట్టాయి.

ఇక ఈ నెలలోనూ ప‌లు తెలుగు సినిమాలు సిద్ధ‌మ‌వుతోన్నాయి. ఫిబ్ర‌వ‌రిలో ర‌వితేజ‌, వ‌రుణ్‌తేజ్‌, సందీప్‌కిష‌న్‌తో పాటు ప‌లువురు యంగ్‌ హీరోలు బాక్సాఫీస్ బ‌రిలో నిల‌వ‌బోతున్నారు. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ల‌తో కూడిన ప‌లు చిన్న సినిమాలు ఈ నెలలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏవో చూద్దాం…

అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ – ఫిబ్ర‌వ‌రి 2న

యాత్ర 2 – ఫిబ్ర‌వ‌రి 8న

- Advertisement -

ఈగ‌ల్ – ఫిబ్ర‌వ‌రి 9న

ఊరు పేరు భైర‌వ‌కోన – ఫిబ్ర‌వ‌రి 9న

లాల్ స‌లాం – ఫిబ్ర‌వ‌రి 9న

ఆప‌రేష‌న్ వాలైంటైన్ – ఫిబ్ర‌వ‌రి 16

సుంద‌రం మాస్ట‌ర్ – ఫిబ్ర‌వ‌రి 16న

తిరుగ‌బ‌డ‌రా సామీ – ఫిబ్రవరి 23

మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా – ఫిబ్రవరి 23

జోరుగా హుషారుగా – ఫిబ్ర‌వ‌రి 29న

Advertisement

తాజా వార్తలు

Advertisement