Monday, April 29, 2024

‘పుష్ప’ వెనుక కథ ఇదే ?

సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా అల్లుఅర్జున్ కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే ఓ వార్త బయటికి వచ్చింది. అయితే ఈ విషయం పై అధికారిక ప్రకటన మాత్రం ఎక్కడ బయటకు రాలేదు.

కానీ విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమా షూట్ చాలావరకు ఇంకా బ్యాలెన్స్ ఉందట. ఇప్పటివరకు జరిగిన షూటింగ్ చాలా తక్కువని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ లు ఆగిపోయాయి. ఇక ఎప్పుడు ఈ షూటింగ్ లు ప్రారంభమవుతాయో కూడా తెలియట్లేదు. కాబట్టి పుష్ప సినిమా షూటింగ్ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పుష్ప ను రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ పూర్తి బాధ్యతను డైరెక్టర్ సుకుమార్ కూడా వదిలేశారట నిర్మాతలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement