Friday, May 3, 2024

ఆచార్య మ్యూజిక్ పై మరో అప్డేట్ న్యూస్!!

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ఆచార్య. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇక మరోవైపు లాంగ్ గ్యాప్ తర్వాత మణిశర్మ చిరంజీవి కాంబినేషన్ రిపీట్ అవుతోంది.

అయితే ఇప్పుడు ఈ కాంబినేషన్ పై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇటీవల లాహె లాహె అంటూ ఓ పాటను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కాగా ఈ సినిమాలో ఉన్న మిగిలిన పాటలు కూడా అంతకు మించి ఉంటాయని తెలుస్తోంది. ఇక ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై మణిశర్మ చిరు ఓల్డ్ కాంబినేషన్ రిపీట్ కాబోతుందని మాట్లాడుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement