Friday, May 17, 2024

రికార్డు రేట్ పలికిన ‘ద‌స‌రా’ థియేట్రిక‌ల్ రైట్స్.. నాని సినిమాకి పిచ్చి క్రేజ్​!

నాని కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన సినిమా ‘దసరా’. ఈ సినిమాకి సుధాకర్ చెరుకూరి నిర్మాన భాద్య‌త‌లు వ‌హిస్తుండ‌గా.. శ్రీకాంత్ ఒదెల డైరుక్ట్ చేస్తున్నారు. ఇక.. ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్‌లో నటిస్తున్న నాని ఈ సినిమాను ఛాలెంజ్‌గా తీసుకున్నాడు. తొలిసారి తెలంగాణ యాసలో డైలాగులు చెప్ప‌బోతున్నాడు. మూవీలో నాని జంట‌డా కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. కాగా,ఈ సినిమా మార్చి 2023లో థియేటర్లలోకి రానుంది.

ప్ర‌స్తుతం షూటింగ్ దశ‌లోనే ఉన్న ఈ సినిమా ఇంకా 50 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ కావాల్సి ఉంది. అయినప్ప‌టికీ ఈ సినిమా భారీ బజ్‌ని సృష్టిస్తోంది. అయితే.. తాజా సమాచారం ప్ర‌కారం, చదలవాడ సోదరులు (‘బిచ్చగాడు’ ఫేమ్) ఈ సినిమా మొత్తం థియేట్రికల్ రైట్స్‌ను రికార్డ్ ధరకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని అన్ని ఏరియాల్లో సినిమాను విడుదల చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement