Wednesday, May 15, 2024

త్రిముఖ పోరు.. థియేట‌ర్ల‌లో పోటీప‌డ‌నున్న మూడు సినిమాలు!

వచ్చే వీకెండ్‌లో టాలీవుడ్ నుంచి మూడు మీడియ‌మ్ బడ్జెట్ సినిమాలు థియేట‌ర్ల వ‌ద్ద పోటీ ప‌డ‌నున్నాయి. ‘‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’’.. ‘శాకిని డాకిని’, ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’.. ఈ మూడు సినిమాలు ఒకే రోజు అంటే సెప్టెంబర్ 16వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.. అయితే ఈ సినిమాలలో ఏది మెప్పిస్తోందో చూడాలి మ‌రి.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ తెర‌కెక్కించి సినిమా ఇది. చలనచిత్ర ప్రపంచం నేపథ్యంలో సాగే రొమాంటిక్ డ్రామా.. ఒక సినీ ప్రముఖుడు, డాక్టర్ మధ్య జరిగే ప్రేమకథ. ఇక ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు.

నేను మీకు బాగా కావాల్సినవాడిని

‘ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపం’ విజయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కిరణ్‌ అబ్బవరం మాస్‌ హీరో ఇమేజ్‌ని తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ మసాలా ఎంటర్‌టైనర్ గా ఉండ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ సిన‌మాతో కోడి రామకృష్ణ కూతురు కోడి దివ్య నిర్మాతగా అరంగేట్రం చేస్తోంది.

- Advertisement -

శాకిని డాకిని

కొరియ‌న్ మూవీ మిడ్‌నైట్ రన్నర్స్‌కి అఫీషియ‌ల్ రిమేక గా తెర‌కెక్క‌తున్న ఈ యాక్షన్ డ్రామాలో రెజీనా కసాండ్రా, నివేదా థామస్ పోలీస్ ఆఫీసర్స్ గా నటించడం క్యూరియాసిటీని పెంచుతుంది. ఈ థ్రిల్ల‌ర్ యాక్ష‌న్ డ్రామా సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement