Thursday, May 2, 2024

Spl Story: కదిలిన కాంగ్రెస్​​​ దండు.. ‘భారత్​ జోడో’ అంటూ సాగుతున్న రాహుల్​!

భారతదేశం అంటేనే సమైక్యతా భావం.. పలు భాషలు, సంస్కృతుల మేళవింపు.. పలు రకాల ప్రజల జీవన విధానం ఉంటుంది. అట్లాంటి దేశంలో ఇప్పుడు మతపరమైన వివాదాలు తలెత్తుతున్నాయి. విభజించి పాలించు తరహాలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లింలను, హిందువులను వేరు చేసి చూస్తోంది. దీంతో స్కూళ్లలో హిజాబ్​ ఇష్యు తలెత్తింది. కొంతమంది మిడి మిడి జ్ఞానం ఉన్న  లీడర్లు అయితే.. ‘‘మసీదులను తవ్వాలి, అక్కడ శవాలొస్తే మీకు, శివాలోస్తే మాకు’’ అనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవారున్నారు. ఇక.. బీజేపీలోని అగ్రశ్రేణి లీడర్లలో కొందరు మహ్మద్​ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలతో విదేశాల్లోనూ భారతదేశం పరువు పోగొట్టుకుంది. ఇట్లాంటి పలు అంశాలను ప్రస్తావిస్తూ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగడుతూ కాంగ్రెస్​ పార్టీ అధినేత రాహుల్​ గాంధీ సమైక్య భారత్​ నినాదంతో పాదయాత్ర చేస్తున్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్​ దాకా సాగే ఈ యాత్రలో కాంగ్రెస్​ శ్రేణులను ఉత్తేజపరుస్తూనే.. ఆయా రాష్ట్రాల ప్రజల బాగోగులను, వారి జీవన విధానాన్ని తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

కేరళలో రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర జోరుగా కొనసాగుతోంది. రాహుల్ పాదయాత్ర సోమవారంతో ఆరో రోజుకు ముగసింది. కేరళలోని పారసాలలో ప్రారంభమైన యాత్ర త్రివేండ్రం శివార్లకు చేరుకుంది. నియ్యతికర ప్రాంతంలో రాహుల్‌ పాదయాత్ర చేపట్టారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా చేనేత కార్మికులున్నారు. ఈ సందర్భంగా రాహుల్​ చేనేత కార్మికులు కుటుంబాలతో మాట్లాడారు. వాళ్ల కష్టాలు తెలుసుకున్నారు. భారత్‌ జోడో యాత్ర కేరళలో 19 రోజుల పాటు కొనసాగనుంది. కేరళలో 456 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర జరుగుతుంది.

అయితే రాహుల్‌గాంధీ కంటేనర్‌లో ఏసీ సర్వీసుల మధ్య బస చేస్తున్నరనే వీడియోలు కొన్ని వైరల్​ కావడంతో ఆ పార్టీ వర్గాల అప్రమత్తమయ్యయి. ఇక మీదట రాహుల్​ కంటైనర్​లలో బస చేయబోరని ప్రకటించాయి. తోటి కార్యకర్తలతో కలిసి స్కూల్లో బస చేస్తారని కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. రాహుల్‌గాంధీ పాదయాత్రను అడ్డుకుంటామని SFI కార్యకర్తలు ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.  

కాగా, దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులను ఉత్తేజం చేయడమే లక్ష్యంగా రాహుల్‌గాంధీ కన్యాకుమారిలో భారత్‌ జోడో యాత్ర ప్రారంభించారు. దీనికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ జాతీయ జెండాను రాహుల్‌కు అందించి యాత్రను ప్రారంభించారు. రాహుల్‌ వెంట 117 మంది నేతలు పాదయాత్ర చేస్తున్నారు. రోజుకు సగటున 25 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగనుంది. 5 నెలల పాటు 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా 3,570 కిలోమీటర్లు పొడవునా పాదయాత్ర కొనసాగనుంది.

- Advertisement -

భారత్ జోడో యాత్రంలో రాహుల్ గాంధీ వెంట వివిధ రాష్ట్రాలకు చెందిన 117 మంది కాంగ్రెస్ నేతలు పాల్గొంటారు. ఈ 117 మందిని భారత్ యాత్రీస్ అని పిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సుంకర పద్మశ్రీ పాల్గొంటున్నారు. తెలంగాణ నుంచి కేతూరి వెంకటేశ్, సంతోష్, కె.వెంకటరెడ్డి, కత్తి కార్తీక, బెల్లయ్య నాయక్ అనులేఖ రాహుల్ తో పాటు ముందుకు సాగుతున్నారు.

వివిధ రాష్ట్రాల నుంచి 32 మంది మహిళలకు యాత్రలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. యాత్రలో రాహుల్ గాంధీ ఎక్కడా హోటల్‌, ఏసీ బస్సుల్లో బస చేయరు. తాత్కాలికంగా ఏర్పాటు చేసే వసతుల్లోనే ఆయన బస చేస్తారు. పాదయాత్రలో సభలు, సమావేశాలు ఉంటాయి. ఇందులో పలు చోట్ల సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ కూడా పాల్గొననున్నారు.

ప్రతిరోజు రోజూ రెండు భాగాలుగా ఈ యాత్ర కొనసాగుతోంది. ఉదయం 7 నుంచి 10.30 గంటల వరకు, మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. రోజూ సగటున 22 నుంచి 23 కిలోమీటర్ల చొప్పున మొత్తం 3,570 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. ప్రధాన యాత్రకు అనుబంధంగా ఆయా రాష్ట్రాల్లో చిన్న జోడో యాత్రలు నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement