Monday, April 29, 2024

ఉప్పెన సినిమా నెట్ ఫ్లిక్స్ లో వచ్చేస్తుందోచ్ !!

బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఉప్పెన. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు మంచి వసూళ్లను కూడా సాధించింది. అటు దర్శకుడు, హీరో హీరోయిన్ కి కూడా మొదటి సినిమా కావడం విశేషం.

ఇక మరోవైపు విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మరింత దగ్గరయ్యాడు. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిత్రం కు డిజిటల్ రైట్స్ కోసం పలు ఓటిటి సంస్థలు పోటీ పడగా నెట్ ఫ్లిక్స్ ఏడు కోట్ల రూపాయలకు దక్కించుకున్నారు. కాగా ఏప్రిల్ 14 నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement