Monday, April 29, 2024

ప్రభుత్వం వెంటనే సిపిఎస్ ను రద్దు చేయాలి…

ప్రొద్దుటూరు, సి పి ఎస్ రద్దు కోరుతూ ఏపి సి పి ఎస్ ఈఎ ఆద్వర్యంలో జరుగుతున్న నిరాహారదీక్ష కు సంఘీభావంగా ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి ప్రొద్దుటూరు శ్రీరాములపేటలోని ఏపి సి పి ఎస్ ఈఎకార్యాలయంలో ఒక రోజు దీక్ష చేపట్టారు.. ఈ సందర్భంగా వారు మొదట ఫించన్ పితామహుడు నకరా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు . . ఈ సందర్భంగా ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి ప్రసంగిస్తూ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా ఇంత వరకు సిపిఎస్ రద్దు చేయకపోవడం చాలా బాధాకరమన్నారు .ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే సిపిఎస్ ను రద్దు చేయాలని ఒంటేరు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఒంటేరుకు మద్దతుగా పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు సంజీవ రెడ్డి ,శివారెడ్డి ,చిట్టే సుబ్బరాయుడు ,విశ్రాంత మెజిస్ట్రేట్ జిలానీ బాషా ,విశ్రాంత ఎస్ ఐ ఆంజనేయులు ,రిటైర్డ్ పి. డి ఓబులరెడ్డి ,అధ్యాపకులు రామ చంద్రా రెడ్డి ,మద్దిలేటి ,చంద్రా రెడ్డి ,సి పి ఎస్ నాయకులు సురేంద్ర రెడ్డి బాలమోహన్ ,నాగేంద్ర రెడ్డి ,గోవర్ధన్ నాయుడు ఎంటిఎ రామచంద్ర, ఎంటిఎఫ్ నాయకులు రఫీ, మనోహర్, నడిగడ్డ సుధాకర్ ,పి టి ఎల్ యు నాయకులు రాజు ,వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement