Saturday, May 11, 2024

వాయిదా పడ్డ అరణ్య రిలీజ్ !!

ప్రభు సోలమన్ దర్శకత్వంలో దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం హాథీ మేరీ సాథీ. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ భాషలో కూడా రిలీజ్ కానుంది. ఇక తెలుగులో అరణ్య టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే వాస్తవానికి ఈ నెల 26న అంటే శుక్రవారం రిలీజ్ కావాల్సి ఉంది. కాగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హిందీ లో ఈ సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు.

ఇదిలా ఉండగా మరోవైపు రానా విరాట పర్వం సినిమా తో కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో రానా సరసన సాయిపల్లవి నటించింది. అలాగే సీనియర్ హీరోయిన్ ప్రియమణి కూడా ఈ సినిమాలో నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement