Wednesday, April 17, 2024

టీబీజీకేఎస్‌తోనే సమస్యల పరిష్కారం

యైటింక్లయిన్‌కాలనీ: టీబీజీకేఎస్‌తోనే సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని ఆర్జీ2 ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. పిట్‌ సెక్రెటరీ హరి ప్రసాద్‌ అధ్యక్షతన వకీల్‌ పల్లి గనిపై ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని నూతన ఉద్యోగలకు కండువా కప్పి యూనియన్‌లోకి ఆహ్వానించారు. అనంతరం ఉద్యోగులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో కేసీఆర్‌ పిలుపు మేకు ఉద్యమంలో పాల్గొన్నామని తెలిపారు. 60 ఏళ్ల కలను నిజం చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని, సీఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుందన్నారు. సింగరేణి కార్మికులను బార్డర్‌ లో సైనికులతో పోల్చి కార్మికులకు అండదండగా నిలుస్తున్నారన్నారు. టీ-బీజీకేఎస్‌, టిఆర్‌ఎస్‌ ద్వారా కారుణ్య నియామకాలతో ఉద్యోగం పొందగలిగామన్నారు. ఐలి శ్రీనివాస్‌ మాట్లాడుతూ కార్మికులందరికిబొగ్గుగని కార్మిక సంఘం అండగా నిలుస్తుందని, హక్కులను కాపాడుతూ కార్మికులకు మేలు జరిగేలా ముందుకు సాగుతుందన్నారు. సంఘంపై నమ్మకంతో చేరిన ప్రతి ఉద్యోగికి కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో ఆవుల రాములు, రాజయ్య, మల్లయ్య, రాజమౌళి, మహేష్‌, అంజయ్య, బాబురావు, మల్లికార్జున్‌, రాములు, రవిశంకర్‌, రాజేశం, శ్రీకాంత్‌, రవీందర్‌, మురళి,రాజారాం, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement