Saturday, April 27, 2024

లైగర్ మూవీ లేటెస్ట్ అప్డేట్ – ఏంటో తెలుసా ?

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ హీరో గా తెరకెక్కుతున్న చిత్రం లైగర్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కాగా ఈ సినిమాలోని కీలకమైన క్లైమాక్స్ సన్నివేశాలకు సంబంధించి ఇప్పుడు షూటింగ్ జరుగుతోంది. ఈ పార్ట్ ఎంతో ఎమోషనల్ గా పవర్ ఫుల్ యాక్షన్ తో సాగుతుందట.

ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విజయ్ దేవరకొండ పూర్తిగా తన లుక్ ను చేంజ్ చేశాడు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ తో కలిసి పూరీ జగన్నాథ్, చార్మినార్ నిర్మిస్తున్నారు. ఇటీవల కాలంలో సరైన హిట్ లేక ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement