Friday, April 26, 2024

శ్రీ రామ నవమికి రాముడిగా ప్రభాస్ వచ్చేస్తున్నాడు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆది పురుష్. ఈ సినిమాలో లో ప్రభాస్ రాముడు గా కనిపించనున్నాడు. అలాగే సీతగా కృతిసనన్ నటించబోతోంది. ఇక రావణాసురుడిగా బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నారు. ఇదిలా ఉండగా శ్రీరామ నవమి సందర్భంగా ఈ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ లుక్ ను విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.

అయితే ఎలాంటి లుక్ రిలీజ్ చేయాలనే ఆలోచన ఉన్న టీంకు సంజయ్ రౌత్ అదిరిపోయే ఐడియా ని ఇచ్చాడట. రాముడి పట్టాభిషేకం జరిగే లుక్ రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పాడట. దీంతో ఆ స్టిల్ నే రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారట మేకర్స్. ఇక బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ రేంజ్ కి మారిన ప్రభాస్ ఈ సినిమాలో ఏ విధంగా రాముడు గా మెప్పిస్తాడా అనేదానిపై అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement