Sunday, May 19, 2024

ఆచార్య నుంచి లాహె లాహె ప్రోమో… అదరగొడుతున్న చిరు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన లుక్స్ ,మోషన్ పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. మరోవైపు మెగా స్టార్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.

కాగా మొన్న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా చిరుతో పాటు చరణ్ నడుస్తూ వస్తున్న ఫోటోని చిత్రయూనిట్ రిలీజ్ చేయగా… తాజాగా లాహె లాహె అంటూ సాగే వీడియో సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఇక ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి స్టైల్, అదిరిపోయే స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్న సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మిస్తుంది.

https://youtu.be/w6IWI1VBP0w
Advertisement

తాజా వార్తలు

Advertisement