Saturday, April 27, 2024

వకీల్ సాబ్ సినిమా హీరోయిన్ కు కరోనా పాజిటివ్

ప్రతిరోజు దేశంలో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా ప్రముఖ హీరోయిన్ నివేద థామస్ కూడా మహమ్మారి బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

నాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నాను. వైద్యుల సూచనలు పాటిస్తూ కరోనా బారినుండి కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నాను అని ట్వీట్ చేశారు. అంతేకాకుండా నా మెడికల్ టీంకు ప్రత్యేక ధన్యవాదాలు, అందరూ సేఫ్ గా ఉండండి. మాస్కులు ధరించండి అని నివేద ట్వీట్ లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement