Tuesday, April 30, 2024

Official | మ‌రోసారి చేతులు క‌లిపిన హ్యాట్రిక్ కాంబో.. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో RT4GM

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలు, హీరోయిన్ల హిట్ కాంబినేషన్ లేదా హీరో, దర్శకులు హిట్ కాంబినేషన్ రిపీట్ కావడం కొత్తేమీ కాదు. చాలా సార్లు కాంబో క్రేజ్ ఆ సినిమాకి విజయాన్ని తెచ్చిపెడుతుంది.. ఇది పరిశ్రమలో నిరూపితమైన సెంటిమెంట్. అదే విధంగా ఈ పాపులర్ సెంటిమెంట్ తో.. హ్యాట్రిక్ కాంబో కొట్టిన ర‌వితేజ‌- గోపిచంద్ మ‌లినేని మ‌రో కొత్త ప్రాజెక్ట్ కోసం చేతులు క‌లిపారు. అభిమానులకు అత్యంత ఇష్టమైన ఈ కాంబినేషన్.. డాన్ శీను, బలుపు, క్రాక్ వంటి మూడు సూపర్ డూపర్ హిట్ సినిమాల‌ను అందించింది.

ఈ రోజు (ఆదివారం) ఈ అద్భుతమైన ప్రాజెక్ట్‌ని సుప్రసిద్ధ మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయ‌నున్నార‌ని అధికారికంగా ప్ర‌క‌టించారు. దానికి సంబందించి పోస్ట‌ర్ కూడా రిలీజ్ చేయ‌గా.. పోస్టర్‌లో సినిమా చుండూరు అనే పల్లెటూరిలో జరుగుతుందని, ఆ గ్రామంలో జరిగిన ఓ డిజాస్టర్‌పై చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ మాస్ ఎంటర్‌టైనర్‌కి ఎస్ థమన్ సంగీతం అందించడానికి ఎంపికయ్యారు.

గోపీచంద్ మలినేని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ కథను రాసుకున్నట్టు తెలుస్తోంది. రవితేజ తన ‘‘ఈగ‌ల్’’ ప్రాజెక్ట్ పూర్తి చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్నాడు. ఈ సినిమా రవితేజ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ కానుంద‌ని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement