Friday, May 3, 2024

‘కీడా కోలా’ నుంచి త‌రుణ్ బాస్కర్ ఫ‌స్ట్ లుక్.. త్వ‌ర‌లోనే టీజ‌ర్ రిలీజ్‌

తెలుగు చిత్రసీమలో తరుణ్ భాస్కర్ ప్రతిభావంతుడైన డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఈ జెన‌రేష‌న్ కి త‌గ్గ‌ట్టుగా సినిమాల‌ను తీస్తూ మంచి హిట్స్ కొడుతున్నారు. తరుణ్ ద‌ర్శ‌క‌త్వ‌లో ఇప్ప‌టికే పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి ప్రత్యేకమైన సినిమాల‌ను వ‌చ్చాయి. ఇప్పుడు తన మూడో ప్రాజెక్ట్ క్రైమ్ కామెడా మూవీ ‘కీడ కోలా’తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌డానికి రెడీగా ఉన్నారు.

కాగా, కీడా కోలాలో హాస్య బ్ర‌హ్మ బ్రహ్మానందం ఒక ప్రత్యేకమైన రోల్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇక తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ డేట్ కూడా ప్ర‌క‌టించారు త‌రుణ్. త‌రుణ్ డైరెక్ట్ చేసిన యూత్ ఫుల్ ఎంట‌ర్టైన‌ర్ ‘ఈ నగరానికి ఏమైంది’ రీ-రిలీజ్ (29న)తో పాటు కీడా కోలా టీజ‌ర్ ను కూడా రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ టీజ‌ర్ రిలీజ్ కి ఇంకా ఐదు రోజులే ఉండ‌టంతో మూవీ నుంచి త‌రుణ్ క్యారెక్ట‌ర్ రివీల్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. నాయుడు అనే పాత్ర‌లో త‌రుణ్ క‌నిపించ‌నున్న‌ట్టు వీడియో చూస్తే తెలుస్తోంది. మ‌రి త‌ర‌ణ్ పోషిస్తున్న ఈ నాయుడు అనే క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుందో టీజ‌ర్ లో చూపిస్తారేమో వెయిట్ చేయాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement