Tuesday, April 30, 2024

‘పార్టీ లేదా పుష్ప’ అంటూ తారక్ ట్వీట్.. ‘వస్తున్న’ అని రీ-ట్వీట్ చేసిన బన్నీ

అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా స్టైలిష్ స్టార్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్.. సోషల్ మీడియా వేదికగా హిలేరియస్‌గా నవ్వించారు. “నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు బావ.. ఇలాంటివి ఎన్నో జరుపుకోవాలి.” అంటూ ట్విట్టర్ వేదికగా ఎన్టీఆర్ పోస్ట్ పెట్టారు. ఇందుకు అల్లు అర్జున్ కూడా స్పందించారు. “విషెస్ చెప్పినందుకు నీకు థ్యాంక్యూ బావ.. నీకు నా హగ్స్” అంటూ స్టైలిష్ స్టార్.. తారక్‌ ట్వీట్‌కు స్పందించారు.

అల్లు అర్జున్ ట్వీట్‌కు ఈ సారి అదిరిపోయే రిప్లయి ఇచ్చారు తారక్. “ఓన్లీ హగ్సేనా? పార్టీ లేదా పుష్ప” అంటూ లాఫ్ ఎమోజీని జత చేశారు. ఇందుకు అల్లు అర్జున్ కూడా ‘వస్తున్నా’ అంటూ రిప్లయి ఇచ్చారు. ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు. తారక్‌లో మంచి చమత్కారి దాగున్నాడని, ఆయనలో మంచి టైమింగ్ ఉందని కామెంట్లు పెడుతున్నారు. ఎన్టీఆర్ తన సెన్స్ ఆఫ్ హ్యూమర్‌తో ప్రతి ఒక్కరిని నవ్విస్తుంటారని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement