Sunday, April 28, 2024

హీరోల తీరు మారాలంటున్న తాప్సీ!!

ఝుమ్మందినాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ తాప్సీ. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలను చేసింది. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. ఆ తర్వాత బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. అక్కడ మాత్రం హిట్ లను అందుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా తాప్సి మాట్లాడుతూ… లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించి మెప్పించడం అంత సులభం కాదని… హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించడానికి అగ్రహీరోలు ఒప్పుకోరని పాత్ర నిడివి తక్కువగా ఉంటుంది కాబట్టి ఇమేజ్ కోణంలో ఆలోచిస్తారని చెప్పుకొచ్చింది.

కథ మొత్తం నాయికల చుట్టూ తిరుగుతుంది… కాబట్టి తమ ఇమేజ్ తగ్గిపోతుందని భయపడుతుంటారు. ఇదే కథానాయకులు కీలక మనిపించే చిన్న పాత్ర అయినా అంగీకరిస్తారు. ఇమేజ్ పట్టింపు లేకుండా పరస్పరం సమన్వయంతో పనిచేస్తే మరిన్ని గొప్ప చిత్రాలు వస్తాయి. అప్పుడు చిత్ర పరిశ్రమలో మహిళా సాధికారత సాధ్యమవుతుందని చెప్పారు. ఇక తాప్సీ చేతిలో అన్ని భాషలలో కలిపి మొత్తం తొమ్మిది చిత్రాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement