Sunday, April 28, 2024

బ‌రువు పెరిగిన‌.. స్టార్ హీరో సూర్య‌

హీరోలు అన్నాక ఆ పాత్రల కోసం బ‌రువు పెర‌గ‌డం..త‌గ్గ‌డం మామూలే.. కాగా తమిళ స్టార్ హీరో సూర్య కొత్త లుక్ వైర‌ల్ అవుతోంది. తాజాగా సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయిన ఒక ఫోటో ఆయన అభిమానులతో పాటు అందరిని కూడా సర్ ప్రైజ్ చేస్తోంది. ఆ ఫోటోలో ఉన్నది సూర్య యేనా అనేంత‌గా ఆయన లుక్ మారింది. గుబురు గడ్డంతో పాటు కాస్త బరువు పెరిగిన సూర్య ను చూసి అంతా కూడా షాక్ అవుతున్నారు. సూర్య ను ఇలా ఎప్పుడు చూడలేదు అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం సూర్య.. శివ దర్శకత్వంలో భారీ పీరియాడిక్ సినిమా ‘కంగువ’ ను చేస్తున్న విషయం తెల్సిందే.రూ.200 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఆ సినిమాలో సూర్య యుద్ధ వీరుడి పాత్రలో కనిపించడంతో పాటు మరో ముఖ్యమైన పాత్రలో కూడా కనిపిస్తాడనే వార్తలు వస్తున్నాయి. ఆ పాత్ర కోసం సూర్య బరువు పెరిగి ఉంటాడు అంటూ తమిళ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసలు విషయం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.ప్రస్తుతం సూర్య కొడైకెనాల్ లో ఫ్యామిలీ తో హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తున్న సూర్య త్వరలో ఈ సినిమా చివరి దశ షూటింగ్ ని మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement