Monday, April 29, 2024

వెబ్ సిరీస్ కే అంత రెమ్యూనరేషనా ?

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. ఓ వైపు హీరోయిన్ గా కొనసాగుతూనే ఐటెం సాంగ్స్ లో సైతం నటిస్తోంది. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న సీటీ మార్ సినిమాలో నటిస్తోంది. అలాగే మాస్ట్రో సినిమాలో కూడా నటిస్తోంది. వీటితోపాటు సత్యదేవ్ …గుర్తుందా శీతాకాలం, ఎఫ్3, దట్ ఈజ్ మహాలక్ష్మి సినిమాలు చేస్తోంది. ఇదిలా ఉండగా ఓటీటీ వేదికగా రిలీజ్ కాబోతున్న లెవెంత్ అవర్ వెబ్ సిరీస్ లో కూడా నటించింది.

ఉగాది సందర్భంగా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా లో ఏప్రిల్ 9 నుంచి ఈ వెబ్ సీరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ లో నటించడానికి ఈ అమ్మడు కోట్లలో పారితోషకం తీసుకుందట. అక్షరాల రెండు కోట్ల రూపాయల వరకూ తీసుకుందని ప్రచారం జరుగుతోంది. ఈ లెవెంత్ అవర్ సిరీస్ కు ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement