Thursday, May 2, 2024

నా కొడుకుని మరోసారి చంపొద్దు – సుశాంత్ తండ్రి

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఘటన జరిగి ఏడాది కావస్తున్నా…ఇప్పటికీ సుశాంత్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనేది తెలియరావట్లేదు. సుశాంత్ ఆత్మహత్య బాలీవుడ్ లోనే కాకుండా అతని కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

ఇదిలా ఉండగా సుశాంత్ జీవిత కథ ఆధారంగా సినిమాని తీయబోతున్నారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా దీనిపై సుశాంత్ తండ్రి కేకే ఆవేదన వ్యక్తం చేశారు. మా అబ్బాయి వ్యక్తిగత జీవితం పై దయచేసి సినిమా తీసి మళ్లీ మళ్లీ చంపేయొద్దు అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఈ విషయమై కోర్టులో కూడా అప్పీల్ చేసేందుకు సిద్ధం అంటున్నారు కేకే సింగ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement