Friday, May 3, 2024

అదనపు విద్యుత్‌ ఛార్జీలపై వినతి పత్రం..

గోదావరిఖని: డెవలప్‌మెంట్‌ చార్జీల పేరుతో వసూలు చేస్తున్న అదనపు విద్యుత్‌ ఛార్జీలు ఉపసంహరించుకోవాలి ఫైట్‌ ఫర్‌ బెటర్‌ సొసైటీ నాయకులు విద్యుత్‌ అధికారులను కోరారు. గోదావరిఖనిలోని శారదనగర్‌ విద్యుత్‌ కార్యాలయంలో ఎస్‌ఈ సంపత్‌ వినతి పత్రం అందించారు. ఇప్పటికే కరోనాతో ఇబ్బందుల్లో ఉన్న సామాన్య, పేద ప్రజలపై ప్రభుత్వం విద్యుత్‌ భారం మోపిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అధ్యక్షులు మద్దెల దినేష్‌, ఉపాధ్యక్షులు కొమ్మ చందు యాదవ్‌ మాట్లాడుతూ రెండు నెలల నుంచి వస్తున్న బిల్లులను చూసి వినియోగదారులు లబోదిబోమంటు-న్నారని, అదనపు డెవలప్‌మెంట్‌ చార్జీలు, అడిషనల్‌ సెక్యూరిటీ డిపాజిట్లు, జీఎస్‌టీ తదితర ఛార్జీల భారం మోపడం సరైంది కాదన్నారు. అదనపు చార్జీల వసూలు విషయంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గడప శ్రీకాంత్‌, ఉపాధ్యక్షులు మాదిరెడ్డి నాగరాజ్‌, సహాయ కార్యదర్శి ఎం. శ్రీనివాస్‌, వినయ్‌, రాజ్‌లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement