Sunday, May 5, 2024

Surya 43 | దుల్కర్ సల్మాన్ తో మల్టీస్టారర్..! కొత్త సినిమా అనౌన్స్ చేసిన సూర్య

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్ర‌స్తుతం శివ డైరెక్ష‌న్ లో ‘కంగువ’ యాక్షన్ డ్రామా సినిమాలో న‌టిస్తున్నాడు. కాగా తాజాగా, సూర్య తన కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశాడు. గత కొంత కాలంగా సూర్య, దుల్కర్ సల్మాన్ కలయికలో ఒక సినిమా రాబోతుందంటూ వార్తలు వస్తుండ‌గా.. ఆ వార్తలని నిజం చేస్తూ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు సూర్య..

ఆకాశమే హద్దురా సినిమాతో బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అనిపించుకున్న సుధా కొంగర, మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ తో తన నెక్స్ట్ సినిమాని సూర్య అనౌన్స్ చేశాడు. ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ డిసెంబ‌ర్ నుంచి ప్రారంభం కానున్న‌ట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో దుల్క‌ర్ పాత్రను మొదట కార్తీ కోసం అనుకున్నట్టు తెలుస్తొంది.

కాగా, ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్‌, విజయ్ వర్మ, నజ్రియా నజీమ్ ముఖ్య పత్రాలు చేస్తున్నారని ఒక వీడియో ద్వారా తెలియజేశాడు సూర్య‌. ఇక పోస్టు చేసిన వీడియో చూస్తుంటే.. పిరియాడికల్ పొలిటికల్ యాక్షన్ డ్రామా కథాంశం అని అర్ధమవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement