Monday, May 6, 2024

టీమిండియా అద్భుతం:మహేష్ బాబు

టీమిండియా పై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంగ్లాండ్తో సొంతగడ్డపై మూడు ఫార్మాట్లలో విజయాలు సాధించడం పై విరాట్ సేనకు అభినందనలు తెలియజేశారుటెస్టులు, టీ20లు, వన్డేలు.. ఫార్మాట్ ఏదైనా మూడు సిరీస్ ల్లోనూ తిరుగులేని విజయాలు సాధించారని కితాబునిచ్చారు. మీ నైపుణ్యానికి ఈ సిరీస్ విజయాలే ఉదాహరణలు అని మహేష్ బాబు అన్నారుఇంగ్లండ్ తో తొలుత 3-1తో టెస్టు సిరీస్ చేజిక్కించుకున్న టీమిండియా ఆపై పరిమిత ఓవర్ల సిరీస్ ల్లోనూ సత్తా చాటింది. 4 టెస్టుల సిరీస్ లో తొలి టెస్టులో ఓటమిపాలైన తర్వాత అద్భుత రీతిలో పుంజుకున్న భారత్ వరుసగా మూడు టెస్టుల్లో నెగ్గింది. ఆపై 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను 3-2తో కైవసం చేసుకుంది. అనంతరం మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను 2-1తో వశం చేసుకుని మూడు సిరీస్ ల్లోనూ విజేతగా నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement