Friday, April 26, 2024

పుష్ప లో సన్నీ లియోన్ ?

సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ టీజర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించి ఐటెంసాంగ్ విషయంలో రకరకాల వార్తలు తెరపైకి వస్తున్నాయి. దిశా పటాని, కాజల్ అగర్వాల్ చాలా మంది పేర్లు వినిపించినప్పటికీ…. తాజాగా సన్నీ లియోన్ పేరు తెరపైకి వచ్చింది.

అయితే సన్నీ లియోన్ అక్షరాల యాభై లక్షల రూపాయలు పారితోషకం డిమాండ్ చేస్తోందట. దీనితో ఐటమ్ సాంగ్ కు ఇంత ఇవ్వాలా వద్దా ఆలోచనను చేస్తున్నారట యూనిట్. ఒకవేళ సన్నీలియోని ని ఓకే చేస్తే ఈ సాంగ్ టాలీవుడ్ లో హై బడ్జెట్ సాంగ్ గా నిలవనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement