Saturday, April 27, 2024

మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాలో సుమంత్ ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయినా ఆ తరువాత మాత్రం జనాల పై ప్రభావం బాగానే కనిపించింది. అయితే ఇప్పుడు మళ్ళీ లాంగ్ గ్యాప్ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువయ్యాయి.

ఇక ఈ సినిమా మే 31 న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అక్కినేని హీరో సుమంత్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా త్రివిక్రమ్ అలా వైకుంఠపురం లో సినిమాలో సుశాంత్ నటించాడు. అయితే సినిమా మొత్తానికి సుమంత్ పాత్ర హైలెట్ గా నిలుస్తుందట. మరి ఈ విషయమై అధికారికంగా మాత్రం ఎక్కడా ప్రకటన రాలేదు. మరి అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించాల్సిందే. ఇక ఈ సినిమాను 2022 సమ్మర్ కానుకగా రిలీజ్ చేయబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement