Tuesday, March 19, 2024

నేటి సంపాద‌కీయం – హిమంత్ కు ఎన్నార్సీ త‌ల‌నొప్పి

అసోంలో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చినా జాతీయ పౌరచట్టం ఎప్పటికైనా తలనొప్పి కాగలదన్నది విశ్లేషకుల అభిప్రాయం. పదవి కోసం పద వీ విరమణ చేసిన శర్బానంద సోనావాల్‌కీ, ఆ పదవిని ఆశించిన హిమంత్‌ బిశ్వ శర్మకూ మధ్య తగాదా తప్పదేమోనన్న వార్తలు వచ్చినప్పటికీ, బీజేపీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం కారణంగా అధికారం బదిలీ సాఫీగా సాగింది.అసోంలో పౌర రిజిస్టర్‌ వివాదం వల్ల బీజేపీకీ,భాగస్వామ్య పక్షాలకూ మధ్య విభేదాలు తలెత్తుతా యేమోనన్న అనుమానాలు ఇప్పటికీ వ్యక్తమవు తున్నాయి. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో వ్యూహకర్తగా వ్యవహరించిన హిమంత్‌ బిశ్వ శర్మ, కాంగ్రెస్‌ ఇతర పార్టీలతోపెట్టుకున్న పొత్తుపైనే తన ప్రచారాన్ని కేంద్రీకృతం చేయడం వల్ల ఈసారి ఎన్నికల్లో పౌర రిజిస్టర్‌ వివాదం పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. ఇది దాటవేతగానే విశ్లేషకులు పేర్కొంటున్నారు..దీని మూలంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికైనా సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. సిఏఏ అమలుపై తన పట్టును సడలించకుండానే, కాంగ్రెస్‌ కూటమిలో మతతత్వ పార్టీలపై బీజేపీ గురిపెట్టింది.ఆ పార్టీల వల్ల రాష్ట్రానికి విదేశీయుల వల్ల ముప్పు ఉందని ప్రచారం చేసి ఆ విధంగా హిందూ ఓటర్లను కూడగట్టగలిగింది.హి మంత్‌ శర్మ ఈ వ్యూహాన్ని రూపొందించారు.అందుకే ఈసారి ముఖ్యమంత్రి పదవిని ఆయనకు పార్టీ అప్పగించింది. జాతీయ పౌర రిజిస్టర్‌కి వ్యతిరేకంగా బీజేపీ మినహా రాష్ట్రంలోని పార్టీలన్నీ పోరాడుతున్నాయి.సీఏఏ ,ఎన్‌ఆర్‌సీ చట్టాలను వెనక్కి నెట్టేసేలా హిమంత్‌ చేసిన ప్రయత్నం ఫలించింది.కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకున్న ముస్లిం వర్గాలు బంగ్లా దేశ్‌కి అనుకూలమైనవనీ, వీటి వల్ల దేశ ప్రయోజనాలు దెబ్బతి ంటాయన్న ఆయన వాదం బాగా పని చేసింది.అయితే,హిందూ ఓటర్లను ఆకర్షించడానికి ఇది బాగా కనిపించినా, రాష్ట్ర సమగ్రత,సమైక్యతలను కాపాడేందుకు ఇది ఏమాత్రం ఉపయోగపడదనీ,ఎప్పటికైనా సిఏఏకి వ్యతిరేకంగా రాష్ట్రంలో పోరు ప్రారంభం కాక తప్పదని లౌకిక వాద వర్గాలు పేర్కొం టున్నాయి.అసోం నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్‌కి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి శర్మ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.దీనిని పున:పరిశీలించాలని ఆ పిటిషన్‌లో కోరారు. దానికి కొంత వ్యవధి పట్టవచ్చు.ఆ విధంగా రాష్ట్రంలో ఆందోళనలు బయలు దేరకుండా అడ్డు కట్ట వేయవచ్చని ఆయన వ్యూహం.అయితే,ఇది కూడాతాత్కాలిక ప్రయోజనాన్ని చేకూర్చేదే. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించకుండా బీజేపీ ఎన్నికలకు వెళ్ళడంపై విమర్శలు వచ్చాయి. నాయకత్వం కోసం సోనావాల్‌,బిశ్వ శర్మలుపోటీ పడటమే కారణ మన్న వాదానికి ప్రచారం లభించింది.వాస్తవానికి ఇది కారణం కాదు. బీజేపీ తెచ్చిన సిఏఏ, ఎన్‌ఆర్‌సీ చట్టాల పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబకుండా కమలనాథులు అనుస రించిన వ్యూహం ఇది. సీఏఏని వ్యతిరేకిస్తున్న వారు హిందువుల్లో కూడా ఉన్నారు.వారు వాస్తవాన్నితెలుసుకుని ఆందోళనలు ప్రారంభించినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు పేర్కొం టున్నారు.2019 ఆగస్టు లో ప్రచురించిన ఎన్నార్సీ తుది ముసాయిదాలో 38 లక్షల మంది ఓటర్లను మినహాయించడంపై అప్పట్లో అసోంలో ఆందోళనలు జరిగాయి. అయితే,ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆ ఆందోళనలు చల్లారాయి.మరో వంక కాంగ్రెస్‌ నేతృత్వంలోనిసెక్యులర్‌ ఫ్రంట్‌లో భాగస్వామ్య పక్షాల మధ్య వైరాన్నిబీజేపీ ఉపయోగించుకుంది.కాంగ్రెస్‌కి మద్దతుఇచ్చేందుకు నిర్ణయించినపార్టీలను తనవైపునకు తిప్పుకుంది.ఆ విధంగా గెలుపును చేజిక్కించుకుంది. అసోం కాంగ్రెస్‌లో కాంగ్రెస్‌కి బలమైన నాయకులులేరు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన తరుణ్‌ గొగొ య్‌ రెండవ శ్రేణి నాయకులను ఎదగనీయలేదన్న విమర్శలు వచ్చాయి. హిమంత్‌ బిశ్వ ఒకప్పుడు కాంగ్రెస్‌ నాయకుడే. రాహుల్‌ గాంధీతో వైరంకారణంగా ఉన్నపళంగా పార్టీ నుంచి వైదొలగిబీజేపీలో చేరారు.ఆయనకు కాంగ్రెస్‌లో వర్గాలు,కలహాల గురించిబాగా తెలుసు.వాటిని ఆయన బాగా ఉపయోగించుకున్నారు. బిశ్వశర్మ వ్యూహాలు ఫలించడం వల్లనే బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇకపైనపాలన సాగించడం ఆయనకు పులిమీద సవారీగానే పరిణమించవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement