Tuesday, April 30, 2024

డైరెక్టర్ గా మారబోతున్న సుధీర్ బాబు ?

హీరో సుధీర్ బాబు గురించి సినీ అభిమానులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. విభిన్నమైన కథలను ఎంచుకుని తన నటనతో ఎంతోమంది ప్రేక్షక అభిమానుల మన్ననలు పొందాడు. ఇక ఆఖరిగా సుధీర్ బాబు వి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో నేచురల్ స్టార్ నాని తో పాటు పోలీస్ ఆఫీసర్ పాత్రలో సుధీర్ బాబు అద్భుతంగా ఆకట్టుకున్నాడు.

ప్రస్తుతం అదే దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి..అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో డైరెక్టర్ పాత్రలో కనిపించబోతున్నాడట సుధీర్. రొమాంటిక్ క్యూట్ లవ్ స్టొరీ గా తెరకెక్కే ఈ సినిమాపై సుధీర్ చాలా నమ్మకాలు పెట్టుకున్నాడట. ఈ సినిమాతో ఎలాగైనా సరే హిట్ కొట్టి తానేంటో మరోసారి నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నాడట. మరి సినిమాతో ఎంతవరకు ఆకట్టుకుంటాడో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement