Friday, May 3, 2024

‘బ్లాక్’ మూవీ టీజర్ ఔట్!

డైలాగ్ కింగ్ సాయి కుమార్ తనయుడిగా సినీ ఇండస్ట్రిలో అడుగుపెట్టిన ఆది.. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుస సినిమాలతో దూకుడు పెంచాడు. అమరన్, కిరాతక, బ్లాక్  సినిమాలతో బీజీగా ఉన్నాడు. వెరైటి కథలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. తాజాగా ‘బ్లాక్’ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. యాక్షన్ సీన్స్ పై కట్ చేసిన టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఆది పోలీసు పాత్రలో కనిపించనున్నాడు. గతంలో కంటే ఇప్పుడు స్టైల్ పూర్తిగా మార్చాడు. మహంకాళి  మూవీస్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాని జీబీ కృష్ణ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాతో బెంగాలీ నటి దర్శన కథానాయికగా పరిచయమవుతోంది. ఈ  సినిమాను త్వరలోనే విడుదల చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement