Saturday, April 27, 2024

పుష్ప అప్ డేట్ వచ్చేసింది…తగ్గేదేలే!!

సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా కనిపించబోతున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ కు విశేష స్పందన లభించింది. కాగా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన… ఆర్య, ఆర్య2 చిత్రాలు ఘన విజయం సాధించడంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.

ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ప్రీ ల్యూడ్ ఆఫ్ పుష్పరాజ్ పేరుతో లో చిత్ర యూనిట్ అప్డేట్ ను ఇచ్చింది. ఇక ఆఖరిలో పుష్పరాజ్ ఇంట్రడక్షన్ ఏప్రిల్ 7 ,6:12 నిమిషాల కు ఉంటుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. కాగా ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement