Friday, April 26, 2024

పరిషత్‌ పోరు.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ

ఏపీలో పరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ.. హైకోర్టులో జనసేన మరో పిటిషన్ దాఖలు చేసింది.  ఎస్ఈసీ నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.  ఎంపిటిసి, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ను రద్దు చేయని జనసేన కోరింది. ఎలక్షన్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని పిటిషన్లలో జనసేన పేర్కొంది. రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి కనీసం అభిప్రాయం కూడా తీసుకోలేదని ఆరోపించింది. ఇది సుప్రీంకోర్టు తీర్పు కి విరుద్దామని పేర్కొంది. హౌస్ మోషన్ పిటిషన్ హైకోర్టు స్వీకరించనుంది. ఇప్పటికే బీజేపీ పిటిషన్ దాఖలు చేసింది. మధ్యాహ్నం 2:15 కి పిటిషన్ ను హైకోర్టు విచారించనుంది.

మరోవైపు బీజేపీ వేసిన హౌస్‌ మోషన్‌ పిటిషన్‌పై ఇవాళ తీర్పు వెలువడే అవకాశం ఉంది. అటు.. ఎస్‌ఈసీ తరఫున కౌంటర్‌ దాఖలు చేయనున్నారు. మధ్యాహ్నం 2 తర్వాత హైకోర్టు విచారణ చేపట్టనుంది. అనంతరం తీర్పు వెలువడే అవకాశం ఉంది. దీంతో హైకోర్టు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

కాగా, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఎన్నికల ప్రక్రియను మొదటి నుంచి ప్రారంభించేలా ఆదేశించాలంటూ బీజేపీ, మరికొందరు దాఖలు చేసిన వ్యాజ్యంలో కౌంటర్లు వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ), పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. విచారణను శనివారానికి వాయిదా వేసింది. అత్యవసరంగా దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దుర్గా ప్రసాదరావు ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement