Monday, April 29, 2024

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్.. వీడియోతో అప్ డేట్

ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ మూవీ అప్ డేట్ ఇచ్చాడు.ఈ చిత్రంలో ప‌వ‌ర్ స్టార్ పవన్‌ కల్యాణ్ హీరోగా న‌టిస్తున్నాడు. కాగా సూపర్ స్టార్ కృష్ణ సినిమాలోని ఎన్నాళ్లో వేచిన ఉదయం సాంగ్‌ను షేర్ చేస్తూ.. ఆ రోజు రానే వచ్చింది.. అంటూ హరీష్‌ శంకర్ ట్వీట్ చేశారు. ఇప్పుడీ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఇప్పటికే ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ కోసం ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ సాయి నేతృత్వంలో భారీ సెట్‌ కూడా వేశారు‌. పవన్‌ కల్యాణ్ ఢిల్లీ టూర్‌లో కొత్త లుక్‌తో కనిపించిన ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి. ఉస్తాద్‌ భగత్‌సింగ్‌లో తాను ఇదే లుక్‌లో కనిపించబోతున్నానంటూ.. హింట్‌ ఇచ్చేశారు పవన్‌ కల్యాణ్.ఉస్తాద్ భగత్‌ సింగ్ సినిమా కోసం పవన్‌ కల్యాణ్‌ బల్క్‌ డేట్స్ ఇచ్చార‌ని.. సుమారు 90 రోజులు షూటింగ్‌కు కేటాయించబోతున్నాడని ఇప్పటికే ఓ వార్త నెట్టింట హల్‌ చల్ చేస్తోంది.

https://twitter.com/harish2you/status/1643463011775184896
Advertisement

తాజా వార్తలు

Advertisement