Saturday, May 11, 2024

ఎడిటోరియ‌ల్ – పేర్లు మార్పు … చైనా కొత్త ఆగ‌డం..

మన దేశంలో నౌకా, రక్షణ రహస్యాలను తెలుసుకోవ డానికి చైనా సరికొత్త యత్నాలను ప్రారంభించింది. అండమాన్‌ సమీపంలోకి నిఘా నౌకల పేరిట గూఢచార నౌకలను పంపుతోంది. అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాలు భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాల ను చేసుకోవడం చైనాకు కంటగింపుగా ఉంది. వీటిని నిలువరించాలంటే భారత్‌ని దెబ్బకొట్టాలన్నది చైనా వ్యూహం. అందులో భాగంగానే మలక్కా జలసంధి సమీ పంలో ఉన్న అండమాన్‌ సమీపంలో భారత్‌కి చెందిన త్రివిధ దళాల కమాండ్‌ చైనాకు ఇబ్బంది కరంగా పరిణ మించింది. మలక్కా జలసంధి మీదుగా ఏటా 60వేల నౌకలు హిందూ మహాసముద్రం నుంచి పసిఫిక్‌ మహా సముద్రంలోకి వెళ్తాయి.ప్రపంచ వాణిజ్యంలో 40 శాతం వాణిజ్యం ఈ ప్రాంతం మీదుగానే సాగుతోంది. దక్షిణ చైనా సముద్రంలో దీవులను సొంతం చేసుకోవడా నికి చైనా ఇప్పటికే పన్నాగాలు చేస్తోంది. వీటిని వియ త్నాం, తదితర దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పుడు దక్షిణ చైనాసముద్రం, హిందూ మహాసముద్రంలోని 33 ప్రాంతాలకు సర్వే నౌకలను పంపాలని చైనా నిర్ణ యించిం ది. నిజానికి ఇవి సర్వే నౌకలు కావు. గూఢచర్యం నెరిపే నౌకలు. శ్రీలంక సమీపంలోకి ఇలాంటి తన నౌకను చైనా ఆ మధ్య అక్కడి సమాచారాన్ని సేకరించేందుకు పంపిం ది.

నిజానికి చైనా గుప్పిట్లో శ్రీలంక ఉన్నందున అక్కడ కొత్తగా సమాచారాన్ని సేకరించేందుకు ఏమీ లేదు. శ్రీలంకకు దగ్గరలో ఉన్న భారత్‌ రక్షణ రహస్యాలను తెలుసుకోవడానికే చైనా ఈ నౌకను పంపిందన్న వార్తలు అప్పట్లో వచ్చాయి. పసిఫిక్‌ మహాసముద్రంలో చైనా ఎంపిక చేసిన సర్వే పాయింట్లు ఆరు అమెరికా స్థావరాల కు సమీపంలో ఉన్నాయి. అమెరికాస్థావరాల నుం చి రహస్య సమాచారాన్ని సేకరించేందుకు ఈ ఆరు సర్వే పాయింట్లను చైనా ఎంపిక చేసింది. చైనాకు వ్యతిరేకంగా అమెరికా,ఆస్ట్రేలియా, జపాన్‌, భారత్‌లు కలిసి క్వాడ్‌ కూటమిని ఏర్పాటు చేసినప్పటి నుంచి చైనాకు కలవరం బయలుదేరింది. క్వాడ్‌ కూటమి వల్ల తమ ఉనికికి ముప్పు వస్తుందని చైనా కలవర పడుతోంది.నిజానికి చైనా పోకడలకు అడ్డు వేయడం కోసమే ఈ కూటమిని అమెరికా ఏర్పాటు చేసింది.క్వాడ్‌ కూటమి గురించి అమెరికా విదేశాంగ మంత్రి,ఇతర నాయకులు పదే పదే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్వాడ్‌ కూటమి వల్ల చైనా నౌకా పాటవం బలహీనపడుతుంది.ఈ కూటమి లోని దేశాల నౌకాదళాలు జరిపే విన్యాసాల కారణంగా చైనానౌకలు యధేచ్ఛగా సంచరించడానికి వీలుండదు. చైనా గూఢచర్యం నేలమీద, నింగిలోనూ సాగుతున్నది. అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దులలోచైనా కొత్తగా నిర్మాణా లు ప్రారంభించింది. తవాంగ్‌ ప్రాంతం తమ దేశంలో అంతర్భాగమని చైనా వాదిస్తోంది. తవాం గ్‌ని కలిపేసుకు నేందుకు చైనాఅరుణాచల్‌లో అంతర్భాగాలుగా ఉన్న ప్రదేశాలకు కొత్త పేర్లు పెడుతోంది.నిజానికి పదేళ్ళ క్రితమే అరుణాచల్‌లోని 15 ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు పెట్టింది. ఈ ప్రాంతాలను టిబెట్‌ దక్షిణ ప్రాంతంగా పిలు చుకోవడానికి ఈ పేర్ల మార్పిడి తతంగాన్ని సాగిస్తోంది. అయితే, ఇక్కడి ప్రజలు ఇందుకు అంగీకరించడం లేదు. ఎంతో కాలంగా తాము పిలుచుకుంటున్న పేర్లకు బదు లు కొత్త పేర్లు పెట్టడాన్ని వారు ఆక్షేపిస్తున్నారు. అరుణా చల్‌ ప్రదేశ్‌లో భారత్‌ తరఫున మంత్రులు, అధికారులు ఎవరు పర్యటనలు జరిపినా చైనా ఆక్షేపణ తెలుపుతోంది. అరుణాచల్‌ ప్రదేశ్‌ భారత్‌లో అంతర్భాగమని మన విదేశాంగ శాఖ ఎన్నిసార్లు స్పష్టం చేసినా లక్ష్య పెట్టడం లేదు.

తాజాగా చైనా అక్కడ రెండు జనావాస ప్రాంతాలు, రెండు నదులకు కొత్త పేర్లతో కూడిన జాబితాను చైనా విడుదల చేసింది. ఈ ప్రాంతాలను టిబెట్‌ ద క్షిణ భాగం అని పిలిపించుకోవడానికి చేస్తున్న పన్నాగాన్నిమన దేశం తీవ్రంగా ఖండించింది. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చీ చైనా యత్నాలను తీవ్రంగా ఖండించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ని భారత్‌ అంతర్భాగం గా యావత్‌ ప్రపంచం గుర్తిస్తున్నవేళ చైనా చేస్తున్న జిమ్మిక్కులు చౌకబారుగా ఉన్నాయని భారత్‌ స్పష్టం చేసింది. అమెరికాతో భారత్‌ సన్నిహితంగా ఉండటం వల్ల పొరుగుదేశాలతో భారత్‌ పోరును కొని తెచ్చుకుం టోందన్న వ్యాఖ్య ఆ మధ్య చైనా నాయకుడు ఒకరు చేశా రు. 2017లో దలైలామా అరుణాచల్‌ ప్రదేశ్‌ పర్యటన తర్వాత చైనా అక్కడ ఆరు ప్రాంతాల పేర్లను మార్చేసిం ది. దీనిపై అప్పట్లో భారత ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. అయితే, ప్రామాణిక అధికారిక పేర్లు అని చైనా తన చర్యలను సమర్ధించుకుంటూ వస్తోంది.2021లో కూడా చైనా ఆరు ప్రాంతాల పేర్లు మార్చేసింది. ఇప్పుడు తాజాగా ఆరు ప్రాంతాలతో పాటు రెండు నదుల పేర్లను మార్చేసింది. దీనిపై కూడా మన దేశం అభ్యంతరాన్ని తెలిపింది. పేర్లు మార్చినంత మాత్రాన ఆ ప్రాంతాలు అరుణాచల్‌లో అంతర్భాగాలు కాకపోవని మన విదేశాం గ శాఖ స్పష్టం చేసింది. ఈ అంశంపై దౌత్యస్థాయిలో ప్రస్తావించి నిరసన తెలుపుతామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement