Sunday, December 8, 2024

ఎక్కడికక్కడే బీజేపీ నాయకుల అరెస్టులు

బైంసా రూరల్ ఏప్రిల్ 5 (ప్రభ న్యూస్) : బీజేపీ పార్టీ అధినేత బండి సంజయ్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపడుతున్న బీజేపీ నాయకులను పోలీసులు ఎక్కడిక్కడే అరెస్టులు చేస్తున్నారు. బుధవారం భైంసా పట్టణంలో ఆందోళనలకు ఉపక్రమించిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవీని ఉదయం వేళలో బయటకు రాకుండా పోలీసులు గృహ‌ నిర్భంధం చేశారు. ఆ తర్వాత బీజేపీ నాయకులు బోస్లే మోహన్ రావు పటల్ ను ఆయన స్వగృహాంలో పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ ముథోల్ అసెంబ్లీ కన్వీనర్ తాడేవార్ సాయినాథ్, గాలి రవి కుమార్, అల్లెం దిలీప్, మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ కపిల్ సింధేలను పోలీసులు అదుపులోకి తీసుకోని లోకేశ్వరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అలాగే పార్టీ మరో నేత పవార్ రామారావు పటేల్ ను పట్టణ సీఐ ఎల్.శ్రీనివాస్ నేతృత్వంలోని పోలీసుల బృందం ఆయనను నివాస గృహంలోనే హౌజ్ అరెస్టు చేసి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆయనతో పాటు పార్టీ ముఖ్య నేతలు మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, తూమోల్ల దత్తు, వడ్నపు శ్రీనివాస్, గోపాల్ సార్డలను అదుపులోకి తీసుకుని రామారావు పటేల్ నివాస గృహంలోనే హౌజ్ అరెస్టు చేశారు. పట్టణ పరిధిలోని పలువురు బీజేపీ ప్రతినిధులు ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీ నుంచి జాతీయ రహదారి మార్గం వరకు ప్రభుత్వ దిష్టి బొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. బండి సంజయ్ తో పాటు పోలీసులు అరెస్టు చేసిన ఎమ్మెల్యేలు ఈటెల రాజేంధర్, రఘునందన్ రావులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement