Tuesday, May 7, 2024

శ్రీలంకన్ క్రికెటర్ బయోపిక్.. రేపు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

క్రికెట్‌ ప్రపంచలోని దిగ్గజ ఆటగాళ్లలో ముత్తయ్య మురళీధరన్ ఒకరు. 800 అంతర్జాతీయ టెస్టు వికెట్లు సాధించిన ఏకైక బౌలర్ శ్రీలంకన్ ఆఫ్ స్పిన్నర్. ఈ గొప్ప క్రికెటర్‌పై బయోపిక్ రానున్నట్టు కొన్ని రోజులు క్రితం ప్రచారం జరిగింది, ఈ సినిమాని ది 800 అనే పేరు కూడా పెట్టారు. కాగా, మురళీధరన్ పాత్రలో తమిళ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని తీసుకున్నారు. మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. విజయ్ సేతుపతి పూర్తిగా మురళీధరన్‌గా మారిపోయాడు.

అయితే ఎల్టీటీఈ ఎకానామిక్ క్రైసిన్ సమయంలో శ్రీలంక క్రికెటర్ ప్రధాని రాజపక్షకు మద్దతు ఇచ్చాడనే పుకార్ల కారణంగా నటుడు విజయ్ సేతేపతికి తమిళ ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. మురళీధరన్ కూడా విజయ్ సేతుపతికి లేఖ రాశారు, ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాలని కోరారు. తన వల్ల ఒక నటుడు బాధపడకూడదని క్రికెటర్ భావించాడు. దీంతో విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు, ఆ తర్వాత ఈ సినిమాపై ఎలాంటి అప్ డేట్ రాలేదు. అయితే, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్ రేపు ఉదయం 08:00 గంటలకు రానుంది. లెజెండరీ క్రికెటర్‌గా బ్రిటీష్ నటుడు దేవ్ పటేల్ నటించనున్నట్లు టాక్. రేపు బయోపిక్‌పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement