Monday, April 29, 2024

టాప్ గేర్ లో కిరణ్… చేతి నిండా సినిమాలే

రాజావారు.. రాణి గారు సినిమా తో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం అయ్యాడు కిరణ్ అబ్బవరం. ఈ సినిమా తో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇక కిరణ్ నటిస్తున్న ఎస్ ఆర్ కళ్యాణమండపం చిత్రం డబ్బింగ్ జరుగుతోంది. ఈ సినిమాను సమ్మర్ కానుకగా మేలో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటలు యూత్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇవి కాకుండా మరో రెండు సినిమాలను కిరణ్ చేస్తున్నాడు. అవి ఒకటి సెబాస్టియన్, రెండు సమ్మతమే చిత్రాలు. ఈ రెండు కూడా షూటింగ్ దశలోనే ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగులు కూడా కంప్లీట్ కాబోతున్నాయి. అయితే ఇందులో ఓ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం విశేషం. ఏదేమైనా ఎటువంటి అంచనాలు లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన కిరణ్ ఇప్పుడు వరుస సినిమాలతో టాప్ గేర్ లో దూసుకుపోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement