Saturday, April 20, 2024

భారత్‌ బంద్‌ విజయవంతం..

చిగురుమామిడి: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ చేపట్టిన భారత్‌ బంద్‌ను మండల కేంద్రంతోపాటు ఇందుర్తిలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో విజయవంతం చేశారు. ఉదయం నుండి దుకాణాలు, హోటళ్లు, పెట్రోల్‌ బంకులు మూసి వేస్తూ స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించారు. సిపిఐ నాయకులు గ్రామాల్లో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ నరేంద్ర మోడీ తీసుకువచ్చిన నూతన సాగు చట్టం వల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని, వెంటనే కేంద్ర ప్రభుత్వం నూతన సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనియెడల వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్‌ చేయడాన్ని ఖండిస్తూ వారిని వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు అందే స్వామి, మండల కార్యదర్శి నాగేల్లి లక్ష్మారెడ్డి, అందె చిన్నస్వామి, కాంతల శ్రీనివాస్‌రెడ్డి, ఉస్మాన్‌, బందెల శ్రీనివాస్‌, బింగి స్వామి, లింగమూర్తి, దుర్గయ్య, రాములు, సారయ్య, వెంకటేష్‌, సంతోష్‌, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement