Tuesday, May 7, 2024

సారీ.. ఇవ్వాల్టి ప్రోగ్రామ్​ క్యాన్సిలైంది.. మ‌ళ్లెప్పుడ‌నేది చెప్తా: విశ్వ‌క్‌సేన్‌

విభిన్న పాత్ర‌ల‌తో త‌న‌దైన న‌ట‌న‌తో మెప్పిస్తూ అభిమానుల‌తో మాస్ కా దాస్ అనిపిచ్చుకున్న‌ విశ్వ‌క్ సేన్, మ‌రో కొత్త పాత్రతో.. రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న‌ అశోక వనంలో అర్జున కల్యాణం సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. విద్యాసాగ‌ర్ చింతా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో విశ్వ‌క్ కి జోడీగా రుక్షర్‌ ధిల్లాన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. శ్రీ వెంకటేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జే క్రిష్ మ్యూజిక్ డైరెక్ట‌ర్. ఇటీవ‌లే విడుద‌లైన ఈ సినిమా ట్రైల‌ర్‌కు ప్రేక్ష‌కుల‌నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.. కాగా మే 6న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నున్న నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్స్ ప్లాన్ రెడీ చేసుకున్నాడు విశ్వ‌క్ సేన్‌.

అందులో భాగంగానే ఇవ్వాల (ఆదివారం) సాయంత్రం హైద‌రాబాద్‌లో ఏఎంబీ సినిమాస్‌లో ఫ్యాన్స్ తో స‌మావేశం ఏర్పాటు చేశాడు. అయితే మూవీ ల‌వ‌ర్స్ కోసం రెడీ చేసిన ఈవెంట్ అనుకోకుండా ర‌ద్దైంది. ఈ విష‌యాన్ని విశ్వ‌క్ సేన్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశాడు. ‘‘క్ష‌మించండి.. సాయంత్రం కార్య‌క్ర‌మం అనుకోని కార‌ణాల‌తో ర‌ద్ద‌యింది.. త్వ‌ర‌లోనే కొత్త తేదీని ప్ర‌క‌టిస్తాం’’ అని సందేశాన్నిపెట్టాడు విశ్వ‌క్ సేన్‌.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement