Tuesday, April 30, 2024

సన్ ఆఫ్ ఇండియా….ఫస్ట్ లిరికల్ వీడియో!!

మంచు మోహన్ బాబు ప్రస్తుతం సన్ ఆఫ్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ తో కలిసి 24 ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లిరికల్ వీడియో మంగళవారం ఉదయం విడుదలకానుందని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. జయ జయ మహావీర అంటూ సాగే ఈ లిరికల్ వీడియో మోహన్ బాబు పాత్రకు సంబంధించిన విషయాన్ని రివీల్ చేసే విధంగా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. అలాగే ఒక సామాన్య వ్యక్తి నుండి ముఖ్యమంత్రి గా ఎదిగిన వ్యక్తి కథాంశం ఈ సినిమాలో కనిపిస్తుందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement