Sunday, April 28, 2024

Sitara | లుంగీ క‌ట్టి ధ‌మ్ మ‌సాలా పాటకు సితార మాస్‌ స్టెప్పులు..

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. త్రివిక్రం దర్శకత్వంలో సంక్రాంతి పండక్కి రిలీజ్ అయ్యి.. సూపర్ హిట్ అందుకుంది ఈ మూవీ. ఇక ఈ సినిమాలోని తమన్ అందించిన మ్యూజిక్ ఇప్పుడు ఓ రేంజ్‏లో దూసుకుపోతున్నాయి. యూట్యూబ్‏లో మిలియన్ వ్యూస్‏లో ట్రెండ్ అవుతున్నాయి.

సినిమాలోని ధమ్ మసాలా పాటకు సినీ హీరో మహేష్ గారాలపట్టి సితార ఘట్టమనేని మాస్ స్టెప్సులేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇదివరకు ఇదే సినిమాలోని ‘‘ఓ మై బేబీ’’ పాటకు డాన్స్ చేసిన సితారా.. ఇప్పుడు ధమ్ మసాలా పాటకు మాస్ స్టెప్పులతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement