Wednesday, May 1, 2024

స‌రికొత్త లుక్ లో సిద్ధార్థ్

‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి చిత్రాల్లో నటించిన హీరో సిద్ధార్థ్‌ ‘టక్కర్‌’ అనే సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్‌ జి. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌, పాషన్‌ స్టూడియోస్‌ తో కలిసి టీ-జీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని తెలుగు లో విడుదల చేస్తున్నారు. వివేక్‌ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్‌ కథానాయికగా నటిస్తున్నారు. మే 26న తెలుగు, తమిళ భాషల్లో భారీస్థాయిలో థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది.
సిద్ధార్థ్‌ పుట్టినరోజు సందర్భంగా టక్కర్‌ మూవీ టీ-జర్‌ ను విడుదల చేశారు మేకర్స్‌. రొమాన్స్‌, యాక్షన్‌ మేళవింపుతో రూపొందిన టక్కర్‌ టీ-జర్‌ ఎంతగానో ఆకట్టు-కుంటోంది. అసలు ప్రేమ అనేదే లేదని నమ్మే యువతికి ఓ యువకుడు దగ్గరవ్వడం, ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో రూపొందిన టీ-జర్‌ ఆసక్తికరంగా సాగింది. అభిమన్యు సింగ్‌, యోగి బాబు, మునీశ్‌ కాంత్‌, ఆర్జే విజ్ఞేశ్‌ కాంత్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నివాస్‌ కె.ప్రసన్న సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా వాంచినాథన్‌ మురుగేశన్‌, ఎడిటర్‌ గా జీఏ గౌతమ్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ గా ఉదయ కుమార్‌ కె వ్యవహరిస్తునాన్రు.

Advertisement

తాజా వార్తలు

Advertisement