Thursday, May 2, 2024

నానితో సినిమా ఒత్తిడి ఉండ‌దు : నిర్మాత వెంక‌ట్ బోయ‌న‌పల్లి

నేచుర‌ల్ స్టార్ హీరో నాని హీరోగా రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం శ్యామ్‌ సింగ రాయ్‌. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ నెల 24న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వెంకట్‌ బోయనపల్లి మీడియాతో ముచ్చటించారు. శ్యామ్‌ సింగ రాయ్‌ ఒక అద్భుతమైన ప్రేమ కథ. అన్ని వర్గాలను ఆకట్టుకోనుంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. డిసెంబర్‌ 24న రాబోతుంది.శ్యామ్‌ సింగ రాయ్‌ నిర్మాణంలో ఎలాంటి ఒత్తిడికి గురి కాలేదు. దానికి కారణం హీరో నాని. ఆయన ఈ కథను నమ్మాడు. నేను ఆయనను నమ్మాను. నాని గారే నన్ను ఈ సినిమా చేయమ న్నారు. ప్రారంభం నుంచి కూడా ఈ సినిమా సక్సెస్‌ మీద నమ్మకంతో ఉన్నాం. నానికి ‘జర్సీ’ ఎలాగో నాకు ‘శ్యామ్‌ సింగరాయ్‌’ అలాంటి చిత్రం. కరోనా కారణంగా కాస్త బడ్జెట్‌ పెరిగింది. ఆ విషయం మాకు ముందే తెలుసు. కొన్ని సెట్స్‌ దెబ్బ తిన్నాయి. అందుకే బడ్జెట్‌ పెరిగింది.ఎన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నాం అనే సంఖ్య కచ్చితంగా చెప్పలేను. కానీ మాకు కావాల్సినన్నీ థియేటర్లు ఇచ్చారు. దిల్‌ రాజు లాంటి పెద్ద డిస్ట్రిబ్య్రూటర్లు మా సినిమాను రిలీజ్‌ చేస్తున్నారు. శ్యామ్‌ సింగరాయ్‌ కథనం 1970 నేపథ్యంలో జరుగుతుంది. కలకత్తా నేపథ్యంలో తీశాం. అక్కడి కల్చర్‌ తెలుస్తుంది. ప్రేక్షకులు కూడా కచ్చితంగా 70వ దశకంలోకి వెళ్లినట్టు- ఫీలవుతాం. అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు- చూపిస్తాం. కలకత్తా బ్యాక్‌ డ్రాప్‌ను చూపించేందుకు భారీ సెట్స్‌ వేశాం.

ఇది యూనివర్సల్‌ మూవీ. తెలుగు వారికి మాత్రమే కాదు అందరికీ నచ్చే సినిమా. దక్షిణాది భాషల్లో మాత్రమే రిలీజ్‌ చేస్తున్నాం. ఇది హిందీలో రీమేక్‌ అవుతుందని నమ్మకం ఉంది. అందుకే హిందీలో విడుదల చేయడం లేదు.
పరిశ్రమలో 12 ఏళ్లుగా ఉన్నాను. ఏడాది క్రితం నిర్మాతగా మారాను. ఓ మూడేళ్ల నుంచి నాని గారితో సినిమా చేయాలని ఎదురుచూస్తూ వచ్చా ను. అలా నాకు ఓ స్పెషల్‌ మూవీ ఆయనతో చేసే అవకాశం వచ్చింది.
నాని గారితో సినిమా చేస్తే ఒత్తిడి ఉండదు. కృష్ణార్జున యుద్దం సినిమాలో నేను భాగస్వామిని. అప్పుడే అనిపించింది చేస్తే ఇలాంటి హీరోతో సినిమా చేయాలని అనుకున్నాను.మొదటగా నిర్మాత అవ్వాలనే ఆలోచన లేదు. కానీ కృష్ణార్జున యుద్దం చేసే సమయంలో సొంత ప్రొడక్షన్‌ పెట్టాలని అనుకున్నాను. అది కూడా నాని గారి సినిమాతోనే ప్రారంభించాలని రెండున్నరేళ్లుగా ఎదురుచూశాను. మంచి సినిమా తీయాలనే కోరిక నిర్మాతలందరికీ ఉంటు-ంది. నేను నాని గారితో మంచి సినిమా తీయాలని అనుకున్నాను. ఈ సినిమా నేను తీసినందుకు ఇంకా హ్యాపీగా ఉంది. సినిమా విడుదలైతే అందరూ బాగుందని అంటారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement