Thursday, May 2, 2024

నటి హేమ కు షోకాజ్ నోటీసు

ఈసారి మా అసోసియేషన్ ఎన్నికల బరిలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, జీవిత రాజశేఖర్, మంచు విష్ణు, నటి హేమ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఎన్నికల ప్రక్రియ మొదలు కాకముందే ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. అయితే తాజాగా నటి హేమకు క్రమశిక్షణా సంఘం నోటీసులు జారీ చేసింది. మా ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ పై చేసిన ఆరోపణలకు వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మా ఎన్నికలు జరగకుండా… అధ్యక్షుడిగా కొనసాగాలని నరేష్ పావులు కదుపుతున్నారు అని ఆమె ఆరోపించింది.

అంతేగాక ఆయన నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని వ్యాఖ్యలు చేసింది. ఇక ఇదే విషయంపై రీసెంట్ గా చిరంజీవి కూడా స్పందించారు. మా ప్రతిష్ట దెబ్బ తీస్తున్న ఎవర్ని ఉపేక్షించవద్దని క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు లేఖరాశారు అలాగే వీలైనంత తొందరగా ఎన్నికల జరిపించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement