Thursday, May 2, 2024

శాకుంతలం నుంచి అల్లుఅర్హ గ్లింప్స్

సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం శాకుంతలం. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళ నటుడు మోహన్ దేవ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో అల్లు అర్హ కూడా ఓ పాత్రలో నటిస్తున్నారు.

ఇక ఇటీవలే అర్హ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యారు. ప్రిన్స్ భారత పాత్రలో అల్లు అర్హ నటిస్తున్నారు. తాజాగా ఒక గ్లింప్స్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఆ వీడియోలో అల్లుఅర్జున్ సెట్స్ కి రావటం కూడా కనిపిస్తుంది. ఇక ఈ వీడియో ను విడుదల చేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అల్లుఅర్జున్ అభిమానులు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement