Thursday, May 2, 2024

24 గంటల్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన మహేష్ టీజర్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉండగా ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ టీజర్ ను విడుదల చేసింది. అయితే ఈ టీజర్ కు అనూహ్య స్పందన లభిస్తోంది.

ఇప్పటికే 800కె లైక్స్ ను సాధించి వన్ మిలియన్ లైక్స్ వైపు దూసుకుపోతోంది. ఇందుకు సంబంధించి ఓ స్పెషల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అంతేకాకుండా 24 గంటల్లో 25.7 మిలియన్ల వ్యూస్ ను సాధించి మరో రికార్డును నెలకొల్పింది. ఇక ఈ సినిమాకు ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తుండగా… వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతోంది. దీని తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా చేయబోతున్నాడు.

https://twitter.com/MusicThaman/status/1425091362005848077?s=19
Advertisement

తాజా వార్తలు

Advertisement